అమేజ్ ఫిట్ జీటీఆర్ 2 స్మార్ట్ వాచ్ కొత్త వెర్షన్ ఆవిష్కరణ
- ఎన్నో కొత్త ఫీచర్లతో వచ్చిన వాచ్
- పీఏఐ హెల్త్ అసెస్ మెంట్ సిస్టమ్
- స్కోరు ద్వారా ఆరోగ్యంపై అవగాహన
- 23 నుంచి మొదలు కానున్న విక్రయాలు
- ధర రూ.11,999
అమేజ్ ఫిట్ జీటీఆర్ 2 కొత్త వెర్షన్ స్మార్ట్ వాచ్ విడుదల అయింది. ఇందులో ఎన్నో హెల్త్, ఫిట్ నెస్ ట్రాకింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇందులో ఉంది. స్పీకర్ ను ఏర్పాటు చేశారు. 1.39 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ అదనపు ఆకర్షణ. రొటేటబుల్ స్క్రీన్ అనే ప్రత్యేకమైన సదుపాయం కూడా ఉంది. 50కు పైగా వాచ్ ఫేసుల్లో నచ్చినదాన్ని సెట్ చేసుకోవచ్చు.
24 గంటల పాటు గుండె కొట్టుకునే క్రమాన్ని ఇది రికార్డు చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందన్నది చెబుతుంది. నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయి ఎంతన్నది తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇందులో పీఏఐ హెల్త్ అసెస్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది హార్ట్ రేటు, ఇతర హెల్త్ ట్రాకింగ్ సమాచారాన్ని పీఏఐ స్కోరు రూపంలో చూపిస్తుంది. దాంతో తమ ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహనకు రావచ్చు.
90కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నట్టు అమేజ్ ఫిట్ తెలిపింది. ఇది వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్. 3జీబీ స్టోరేజీ కూడా ఉంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను జోడించారు. బ్లాక్, గ్రే రంగుల్లో లభ్యమవుతుంది. ఈ నెల 23 నుంచి విక్రయాలు ఫ్లిప్ కార్ట్, అమేజ్ ఫిట్ పోర్టల్ లో మొదలవుతాయి. దీని ధర రూ.11,999. అయితే ఈ నెల 23న మొదటి రోజు రూ.10,999కే కంపెనీ ఆఫర్ చేస్తోంది.