ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల

  • ధరలు రూ.11,999 నుంచి ప్రారంభం
  • యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు
  • సున్నా వడ్డీ ఈఎంఐ సదుపాయం లభ్యం
ఇన్ఫినిక్స్ సంస్థ నోట్ 12 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోట్ 12, నోట్ 12 టర్బో పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చింది. ఇందులో నోట్ 12 బడ్జెట్ యూజర్ల కోసం కాగా.. నోట్12 టర్బో మిడ్ రేంజ్ విభాగంలోకి వస్తుంది.

నోట్ 12 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.11,999. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. నోట్ 12 టర్బో 8జీబీ ర్యామ్, 128జీ బీ స్టోరేజీ రకం ధర రూ. 14,999. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు ఇస్తోంది. నోట్ 12ను రూపాయి వడ్డీ లేకుండా నెలవారీ రూ.2,000 ఈఎంఐపై తీసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకుల కస్టమర్లకు 3, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ పై కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ రెండు ఫోన్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తాయి. 1,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉండేలా తయారు చేశారు. డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తాయి. నోట్ 12లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ వాడారు. నోట్ 12 టర్బోలో హీలియో జీ95 ప్రాసెసర్ వినియోగించారు. రెండింటిలోనూ వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్ ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. రెండింటిలోనూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి.


More Telugu News