ఒమిక్రాన్ బీఏ 4 రెండో కేసు తమిళనాడులో
- ప్రకటించిన రాష్ట్ర వైద్య మంత్రి సుబ్రమణియన్
- హైదరాబాద్ లో నమోదైన తొలి కేసు
- లక్షణాలు పెద్దగా కనిపించడం లేదన్న వైద్యులు
- వ్యాధి తీవ్రత కూడా లేదని స్పష్టీకరణ
కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ లో ఉప రకమైన బీఏ 4 తమిళనాడులోకి అడుగుపెట్టింది. దేశంలో మొదటి కేసు హైదరాబాద్ లో వెలుగు చూసిన రెండు రోజులకే తమిళనాడులో రెండో కేసు బయటపడింది. తమిళనాడులో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 4 కేసు ధ్రువీకరణ అయినట్లు వైద్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చెంగల్ పట్టు జిల్లా నవులూరుకు చెందిన వ్యక్తిలో ఈ వైరస్ గుర్తించారు. బీఏ 4 రకాన్ని ఈ ఏడాది జనవరి 10న దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్నారు. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇండియా సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం ఈ నెల 23న బులెటిన్ విడుదల చేయనుంది.
ఒమిక్రాన్ వేరియంట్ ఏదైనా కానీ, గతానికి భిన్నంగా కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కూడా లేదని స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తిలో బీఏ 4 రకాన్ని గుర్తించినట్టు తెలంగాణ సర్కారు శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. సంబంధిత వ్యక్తిలో లక్షణాలు ఏవీ లేవని వైద్యులు వెల్లడించారు.