అమ్మఒడి పథకంపై మాటతప్పి, మడమతిప్పారు: సీపీఐ రామకృష్ణ
- తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు వేయాలన్న రామకృష్ణ
- ప్రభుత్వం రూ. 13 వేలు మాత్రమే వేయాలనుకుంటోందని విమర్శ
- పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ. 1000 కోత విధించారన్న సీపీఐ నేత
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అమ్మఒడి పథకంపై కూడా జగన్ మాట తప్పి, మడమ తిప్పారని దుయ్యబట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మఒడిని అమలు చేయలేదని చెప్పారు. ఈ ఏడాది జూన్ లో విడుదల చేసే అమ్మఒడికి కేవలం రూ. 13 వేలు మాత్రమే జమ చేయాలనుకుంటున్నారని... ఇది దారుణమని అన్నారు. అమ్మఒడి పథకంలో కోతలను విధించడానికి ప్రభుత్వం ఎన్నో మెలికలు పెడుతోందని చెప్పారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి కోతలు విధించకుండా... తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు వేయాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రూ. 1000 కోత విధించారని, ఇప్పుడు మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ. 1000 తగ్గించబోతున్నారని రామకృష్ణ విమర్శించారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.