'ఎఫ్ 3' చూస్తూ నవ్వకపోతే నామీదొట్టు: దేవిశ్రీ ప్రసాద్

  • ఆర్ ఆర్ చేసేటప్పుడు 'ఎఫ్ 3' చూశానన్న దేవిశ్రీ
  • తనకి జంధ్యాల .. ఈవీవీ గుర్తొచ్చారంటూ వ్యాఖ్య 
  • ఇది నాన్ స్టాప్ నవ్వుల పండగ అంటూ కితాబు 
  • అనిల్ మెచ్చుకోవడం ఆనందంగా ఉందంటూ వివరణ   
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 3' ఈ నెల 27వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడికి కామెడీపై మంచి పట్టుంది. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసే తీరు చాలా బాగుంటుంది. 

వెంకటేశ్ పాత్రను గురించి చెప్పేటప్పుడు వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ తో యాక్ట్ చేసి చూపిస్తారు. అలాగే వరుణ్ తేజ్ విషయంలోనూ. ఈ సినిమాకి ఆర్ ఆర్ చేస్తూ నవ్వు ఆపుకోలేకపోయాను. ఈ సినిమా చూస్తూ నవ్వకపోతే నా మీదొట్టు. ఈ సినిమా చూస్తుంటే ఒక జంధ్యాల .. ఒక ఈవీవీ గుర్తుకు రావడం ఖాయం.

ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందరూ కూడా పోటీపడి మరీ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంతలా నాన్ స్టాప్ గా నవ్వించిన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూసిన తరువాత ఆర్ ఆర్ అద్భుతంగా ఉందనీ .. నాకు వంద హగ్గులు  .. వంద ముద్దులు అని అనిల్ అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.


More Telugu News