కొండెక్కుతోన్న టమాటా ధరలు
- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గరిష్ఠంగా కిలో రూ.88
- రెండు నెలల క్రితం వరకు టమాటా ధరలు విపరీతంగా పడిపోయిన వైనం
- వారం రోజులుగా వాటి ధరలు పైపైకి
టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. పలు వ్యవసాయ మార్కెట్లలో ఎవరూ ఊహించని విధంగా భారీ ధరలు పలుకుతున్నాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో ప్రస్తుతం టమాటా ధర గరిష్ఠంగా కిలో రూ.88 వరకు పలికింది. రెండు నెలల క్రితం వరకు టమాటా ధరలు విపరీతంగా పడిపోయాయి. అయితే, వారం రోజులుగా వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి.
టమాటా దిగుబడులు తగ్గడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మార్కెట్ కు టమాటాలు తక్కువగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. నిన్న రైతులు 155 టన్నుల టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు కూడా టమాటాలు ఎగుమతి చేస్తారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ధరలు మరింత మండిపోయే అవకాశం ఉంది.