గాల్లో ఉండగానే పనిచేయడం మానేసిన ఇంజిన్.. ముంబైలో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
- ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన విమానం
- విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఆగిపోయిన వైనం
- తిరిగి ముంబైకి తరలించి సేఫ్ ల్యాండింగ్
- మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరు తరలించిన ఎయిర్ ఇండియా
- విచారణ ప్రారంభించిన డీజీసీఏ
ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. గగనతలంలో ఉండగానే విమానంలోని ఒక ఇంజిన్ ఆగిపోవడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43గంటలకు బెంగళూరు బయలుదేరింది.
రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ముంబై మళ్లించి 10.10 గంటలకు ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరుకు తరలించారు.