తొందరపడుతున్న నైరుతి.. చాలా ముందుగానే కేరళను తాకనున్న రుతుపవనాలు

  • ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా కేరళను తాకనున్న రుతుపవనాలు
  • వచ్చే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు
  • రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయంటున్న అధికారులు
నైరుతి రుతుపవనాలు ఈసారి జోరుమీదున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1న ఇవి కేరళను తాకుతాయి. ఈసారి కాస్తంత ముందుగానే అంటే ఈ నెల 27నే కేరళను తాకుతాయని వాతావరణశాఖ అధికారులు ఇటీవల అంచనా వేశారు. అయితే, అవి ఇంకాస్త ముందుగానే అంటే ఈ నెల 25నే రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నిన్ననే రుతుపవనాలు విస్తరించాయి.

గత రెండు మూడు రోజులుగా కేరళ, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే ఐదు రోజులు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.


More Telugu News