ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్.. టూర్‌లో 4 రోజుల పాటు ఛండీగఢ్‌లో పర్యటన
- రాత్రికి ఢిల్లీలోనే బస
- శనివారం వరుస భేటీలు నిర్వహించనున్న కేసీఆర్
- ఆదివారం ఛండీగఢ్‌కు వెళ్లనున్న సీఎం
- కేసీఆర్ వెంట ఆప్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్
- ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం
దేశ వ్యాప్త పర్యటన కోసం శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న కేసీఆర్... శనివారం రాజకీయ, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతోనూ కేసీఆర్ భేటీ కానున్నారు.
తన పర్యటనలో భాగంగా ఆదివారం ఛండీగఢ్ వెళ్లనున్న కేసీఆర్ అక్కడే ఏకంగా నాలుగు రోజుల పాటు గడపనున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు పాల్గొంటారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు.