చెన్నైతో పోరు... గెలుపు కోసం రాజస్థాన్ అమీతుమీ
- టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
- బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ
- జట్టులోకి వచ్చిన రాయుడు
- రాజస్థాన్ జట్టులో హెట్మెయర్ కు చోటు
ఐపీఎల్ తాజా సీజన్ లో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ నేటి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తును మరింత పదిలం చేసుకుంటుంది.
ఇక నేటి మ్యాచ్ విషయానికొస్తే,... చెన్నై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ ఓడినా తగ్గేదే లేదని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగే తీసుకుని ఉండేవాళ్లమని తెలిపాడు. ఇక జట్టులో ఒక మార్పు చేశామని, జేమ్స్ నీషామ్ స్థానంలో హెట్మెయర్ వచ్చాడని వెల్లడించాడు. అటు, చెన్నై జట్టులోనూ ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ ధోనీ తెలిపాడు. శివం దూబే స్థానంలో అంబటి రాయుడ్ని తీసుకున్నామని వివరించాడు.