తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం!.. డీఎస్పీ ఉద్యోగార్థుల ఎత్తు త‌గ్గింపు!

  • డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తు165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గింపు
  • ఈ దిశ‌గా బీఎస్పీ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్‌
  • తాజాగా ఎత్తు త‌గ్గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్ 1లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్న డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తును 167 సెంటీ మీట‌ర్ల నుంచి 165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శుక్రవారం తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

యూపీఎస్సీ నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో కూడా ఐపీఎస్ అభ్య‌ర్థుల ఎత్తు 165 సెంటీ మీట‌ర్లే ఉన్న‌ప్పుడు తెలంగాణ మాత్రం డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తు 167 సెంటీ మీట‌ర్లు ఎందుకంటూ కొన్నాళ్ల క్రితం మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తును 165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News