ఎంతకీ లొంగని ఉక్రెయిన్... ఇక థర్మోబేరిక్ బాంబులను బయటికి తీస్తున్న రష్యా
- రష్యా అమ్ములపొదిలో ప్రమాదకర అస్త్రాలు
- ఇప్పటిదాకా సాధారణ ఆయుధాలనే వాడుతున్న వైనం
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్
- భారీ నష్టం కలిగించే థర్మోబేరిక్ బాంబులు
గత మూడు నెలలుగా భారీ స్థాయిలో దాడులు చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోలేకపోవడం రష్యాను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించిన రష్యా... ఇప్పటిదాకా ఓ మోస్తరు ఆయుధాలనే ఉపయోగించింది. అయితే సైనికపరంగా తనకు భారీ నష్టం కలగడాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతోంది. దాంతో ఉక్రెయిన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని పుతిన్ భావిస్తున్నాడు.
ఈ క్రమంలో, రష్యా సేనలు అత్యంత ప్రమాదకరమైన థర్మోబేరిక్ బాంబులను ఉక్రెయిన్ పై ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అణుబాంబుల స్థాయిలో కాకపోయినా, తీవ్ర విధ్వంసం సృష్టించడంలో థర్మోబేరిక్ బాంబుల తీరే వేరు. ఇవి కొన్ని సెకన్ల తేడాతో వెళ్లి ప్రత్యర్థి మీద పెద్ద సంఖ్యలో పడతాయి. వీటి లాంచర్ ను ఓ యుద్ధ ట్యాంకు పైభాగంలో అమర్చుతారు. హాలీవుడ్ సినిమా 'వాల్-ఈ'లో కనిపించే రోబో మాదిరే ఈ థర్మోబేరిక్ బాంబుల లాంచర్ దర్శనమిస్తుంది.
ఉక్రెయిన్ పై ఏక కాలంలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించాలని భావిస్తున్న పుతిన్ థర్మోబేరిక్ బాంబుల వినియోగానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇవి సంప్రదాయ బాంబుల కంటే పరిమాణంలో పెద్దవి. ఇవి కూడా మిస్సైళ్ల వంటివే. వీటిని వాక్యూమ్ బాంబులని కూడా పిలుస్తారు. ఇవి కలిగించే ప్రభావం అంతాఇంతా కాదు. అందుకే థర్మోబేరిక్ బాంబులు యుద్ధానికి ముందే శత్రువులను హడలెత్తిస్తుంటాయి.
ఈ బాంబు చాలా శక్తిమంతమైన పేలుడును కలిగిస్తుంది. ఈ థర్మోబేరిక్/వాక్యూమ్ బాంబులో రెండు సెక్షన్లు ఉంటాయి. ఇది రెండుసార్లు విస్ఫోటనం చెందుతుంది. ఇది లక్ష్యాన్ని చేరుకోగానే... మొదట తనలోని ఇంధన మిశ్రమాన్ని గాల్లోకి వెదజల్లుతుంది. తద్వారా ఇంధన మిశ్రమంతో కూడిన ఓ గాలి మేఘాన్ని సృష్టిస్తుంది. అనంతరం జరిగే రెండో పేలుడు ఆ ఇంధన మిశ్రపు మేఘాన్ని మండిస్తుంది. దాంతో భీకరమైన విస్ఫోటనం సంభవించి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
రెండోసారి పేలిన సమయంలో ఇది గాల్లోని ఆక్సిజన్ ను గ్రహించి ఓ శూన్యస్థితిని సృష్టించి, ఓ మండుతున్న అగ్నిగోళం వంటి పేలుడుకు కారణమవుతుంది. మామూలు మిస్సైళ్లు, సంప్రదాయ బాంబులతో పోల్చితే వీటి నుంచి విడుదలయ్యే ఉష్ణం ఎంతో ఎక్కువ. ఇది పేలితే వేడిమితో పాటు అపారమైన ఒత్తిడి వెలువడుతుంది.
ఇప్పుడీ బాంబులనే ఉక్రెయిన్ పై ప్రయోగించేందుకు రష్యా సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడికి దిగినప్పుడే ఈ థర్మోబేరిక్ బాంబుల లాంచర్లను రష్యా పలు ప్రాంతాల్లో మోహరించింది. అయితే వాటిని ఇప్పటిదాకా ప్రయోగించలేదు.