రాజ్యసభ టిక్కెట్లు అమ్ముకుని, కొనుక్కునే సామర్థ్యం చంద్రబాబుకే ఉంది: అంబటి రాంబాబు

  • నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభుకు టీడీపీ రాజ్యసభ సీట్లు ఇస్తే తప్పు లేదన్న అంబటి 
  • పొరుగు రాష్ట్రం వారికి మేం రాజ్యసభ సీట్లు ఇస్తే తప్పా? అంటూ ప్రశ్న 
  • గార‌డీ విద్యలు చేసే వ్య‌క్తి చంద్ర‌బాబు అంటూ విమర్శలు 
రాజ్య‌స‌భ సీట్ల కేటాయింపు దిశ‌గా ఏపీలో అధికార పార్టీ వైసీపీ తీసుకున్న నిర్ణ‌యంపై విప‌క్ష టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ్య‌స‌భ సీట్ల‌ను వైసీపీ అమ్ముకుందంటూ టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేస్తూ వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి బీద మ‌స్తాన్ రావు గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఏపీ జ‌ల‌న‌వ‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా టీడీపీ ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. 

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన అంబ‌టి రాంబాబు.. రాజ్యసభ టిక్కెట్లు అమ్ముకుని, కొనుక్కునే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని విమ‌ర్శించారు. నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభుకు టీడీపీ రాజ్యసభ సీట్లు ఇస్తే తప్పు లేదు గానీ, పొరుగు రాష్ట్రం వారికి మేం రాజ్యసభ సీట్లు ఇస్తే తప్పా? అని అంబ‌టి ప్ర‌శ్నించారు. స‌త్తా ఉన్న నాయ‌కుడు జ‌గ‌న్ అని పేర్కొన్న అంబ‌టి... గార‌డీ విద్య‌లు చేసే వ్య‌క్తి చంద్ర‌బాబు అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News