అమెరికాలో మొట్టమొదటిసారిగా టీ20 లీగ్... పెట్టుబడులతో ముందుకొచ్చిన సత్య నాదెళ్ల
- అమెరికాలో క్రికెట్ అభ్యున్నతికి బాటలు
- 2024లో అమెరికా వేదికగా వరల్డ్ కప్
- తాజాగా మేజర్ లీగ్ క్రికెట్ కు రూపకల్పన
- పెట్టుబడులకు ఆహ్వానం పలికిన నిర్వాహకులు
- లీగ్ పట్ల ఆసక్తి చూపుతున్న భారత సంతతి వ్యాపారవేత్తలు
అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ అనేక చర్యలు తీసుకుంటోంది. అనేక క్రికెట్ పోటీలకు అమెరికాను వేదికగా చేస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ పోటీలకు వెస్టిండీస్ తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే... అమెరికాలో క్రికెట్ కు మరింత ఊపునిచ్చేలా ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ నిర్వహిస్తున్నారు. దీని పేరు మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్ సి).
ఈ లీగ్ లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పెట్టుబడులు పెడుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. వీరే కాదు... పలువురు భారత సంతతి వ్యాపారవేత్తలు కూడా పెట్టుబడులకు ముందుకు రావడంతో దాదాపు 120 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమకూరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 44 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగా, రాబోయే 12 నెలల్లో మరో 76 మిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో వస్తాయని అంచనా వేస్తున్నారు.
దీనిపై మేజర్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, టోర్నీ నిర్వహణలో నిధులకు కొరత లేదని, పెట్టుబడుల ఆకర్షణ దిశగా అద్భుతమైన స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా విపణిగా అమెరికా కొనసాగుతోందని, అలాంటి చోట ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభం కానుందని వివరించారు.
సత్య నాదెళ్ల అమెరికా క్రికెట్ లీగ్ పై స్పందిస్తూ, తాను భారత్ లో పుట్టిపెరగడం వల్ల క్రికెట్ అనేది అభిరుచుల్లో ఒకటిగా మారిందని తెలిపారు. అంతేకాదు, క్రికెట్ ఆడడం వల్ల, అందులోని పోటీతత్వం, సమష్టితత్వం వల్ల బృందాలతో ఎలా పనిచేయాలి? నాయకత్వ లక్షణాల మెరుగు వంటి అంశాల్లో పురోగతి సాధించగలిగానని చెప్పారు. క్రికెట్ లోని పరిస్థితులనే తన కెరీర్ కు కూడా వర్తింపజేస్తానని, ఇప్పటిదాకా తాను ఆ సూత్రాలనే పాటించానని సత్య నాదెళ్ల వివరించారు.
కాగా, సోమశేఖర్ (మద్రోణ వెంచర్ గ్రూప్), వీసీ ఆనంద్ రాజన్, వెంకీ హరినారాయణ (మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్ షిప్ సంస్థ పార్ట్ నర్స్), సంజయ్ గోవిల్ (ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ చైర్మన్) తదితరులు కూడా అమెరికా క్రికెట్ లీగ్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్ ను తమ భాగస్వామిగా అమెరికా క్రికెట్ సంఘం ఎంచుకుంది. త్వరలోనే ఈ క్రికెట్ లీగ్ కు సంబంధించి షెడ్యూల్ రానుంది.