సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
- 3 రోజులుగా ఢిల్లీలోనే కిరణ్ కుమార్ రెడ్డి
- 45 నిమిషాల పాటు జరిగిన భేటీ
- భేటీలో చర్చకు వచ్చిన అంశాలు వెల్లడి కాని వైనం
- సోనియాతో భేటీ తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరిన నల్లారి
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకే 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయారు. సోనియాతో భేటీ తర్వాతే తిరుగు పయనం అవ్వాలని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి... ఎట్టకేలకు శుక్రవారం మధ్యాహ్నం సోనియాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ఆయన కాసేపటి క్రితం హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
ఢిల్లీకి వెళ్లిన రోజు వ్యక్తిగత పనుల నిమిత్తమే ఇక్కడికి వచ్చానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి... ఆ తర్వాత అసలు మీడియాకే కనిపించలేదు. తాజాగా సోనియాతో భేటీ అయిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఈ భేటీలో సోనియా, కిరణ్ కుమార్ రెడ్డిలు దాదాపుగా 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.