కోతి, కుక్క కలిసి చిప్స్ ప్యాకెట్ ను ఎలా దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాయో.. వీడియో చూడండి!

  • కుక్క మీదకు ఎక్కి చిప్స్ దొంగిలిస్తున్న కోతి
  • గత డిసెంబర్ లో తీసిన వీడియో
  • నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న వీడియో
ఈ కోతికి, కుక్కకు ఉన్న ఫ్రెండ్ షిప్ చూస్తే అందరూ నోరెళ్ల బెడతారు. ఈ రెండూ కలిసి ఓ షాప్ లో చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేస్తున్న తీరు 'ఔరా' అనిపిస్తుంది. ఈ ఇద్దరు దొంగలు చోరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది డిసెంబర్ లో తీసినది. కుక్కపైకి ఎక్కిన కోతి చిప్స్ ప్యాకెట్ ను దొంగిలించే ప్రయత్నం చేసింది. 

మరోవైపు ఈ వీడియోకు పెట్టిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. 'కోతి, కుక్క మంచి స్నేహితులు కాదని ఎవరు చెప్పగలరు' అని వీడియో షేర్ చేసిన వ్యక్తి సరదా క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.


More Telugu News