పోలీసు ఉద్యోగార్థులకు రెండేళ్ల వయో పరిమితి పెంపు.. పల్లా విజ్ఞప్తికి కేసీఆర్ ఆమోదం
- వయో పరిమితి పెంపుపై ఎమ్మెల్సీ పల్లా విజ్ఞప్తి
- కరోనా, 95 శాతం స్థానికతను ప్రస్తావించిన పల్లా
- అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ సీఎస్, డీజీపీలకు కేసీఆర్ ఆదేశం
తెలంగాణ పోలీసు శాఖలో ప్రకటించిన ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ కేసీఆర్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విజ్ఞప్తి మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల అనిశ్చితి, తెలంగాణలో తొలిసారి 95% స్థానికత అమలులోకి రావడం దృష్ట్యా తెలంగాణ యువతీ, యువకులకు వయోపరిమితిని పెంచాలని కేసీఆర్‌కు పల్లా విజ్ఞప్తి చేశారు. పల్లా విజ్ఞప్తిపై వేగంగా స్పందించిన కేసీఆర్... ఆ మేరకు పోలీసు శాఖ ఉద్యోగార్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచేలా చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.