'ఎఫ్3'లో వెంకటేశ్ పారితోషికం ఎంతో తెలుసా..?
- ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఎఫ్3'
- ప్రధాన పాత్రలను పోషించిన వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా
- ఈ సినిమాకు వెంకీ రూ. 15 కోట్లు తీసుకున్నారంటూ టాక్
వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఎఫ్3' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహాన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు పొందింది. 'ఎఫ్2'కి మించి ఈ చిత్రంలో కామెడీ ఉండబోతోందనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అది వెంకటేశ్ రెమ్యునరేషన్ కు చెందిన వార్త. 'ఎఫ్2'కి రూ.5 కోట్లు తీసుకున్న వెంకీ.. 'ఎఫ్3'కి రూ. 15 కోట్లు తీసుకున్నారనేదే ఆ వార్త సారాంశం. మరోవైపు ఈ చిత్రంలో పూజ హెగ్డే ఒక ప్రత్యేక సాంగ్ లో ప్రేక్షకులను అలరించబోతోంది.