ఈ బరితెగింపు ఏమిటి అచ్చెన్నా...?: విజయసాయిరెడ్డి
- అచ్చెన్నాయుడిపై విజయసాయి విమర్శలు
- ప్రభుత్వానికి టోకరా వేశాడని వ్యాఖ్య
- బెదురు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నాడని విమర్శలు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ధ్వజమెత్తారు. పెద్దబమ్మిడి గ్రానైట్ క్వారీ నుంచి ఒకే పర్మిట్ తో మూడు లోడ్లు గ్రానైట్ తరలించినట్టు విజిలెన్స్ తనిఖీలో బయటపడిందని విజయసాయి వెల్లడించారు.
"ప్రభుత్వానికి రూ.4.5 కోట్లు టోకరా వేశావు. రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ పై దర్యాప్తు జరుగుతున్నా నదురు బెదురు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నావు. ఈ బరితెగింపు ఏమిటి అచ్చెన్నా?" అంటూ విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు.