ఏపీలో ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉంది: అచ్చెన్నాయుడు
- వైసీపీ మంత్రులు త్వరలో విమాన యాత్రలు చేస్తారని అచ్చెన్న ఎద్దేవా
- దొరికితే ప్రజలు వెంటబడి కొడతారని వైసీపీకి భయమని వ్యాఖ్య
- పొత్తులు ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని అభిప్రాయం
- జగన్ తండ్రి వైఎస్ఆర్ అప్పట్లో పొత్తులు పెట్టుకోలేదా? అని ప్రశ్న
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ సారి టీడీపీ మహానాడును ప్రకాశం జిల్లా మండువవారి పాలెంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహానాడుకు పోటీగా వైసీపీ బస్సు యాత్రలు చేస్తోందని చెప్పారు. వైసీపీ మంత్రులు త్వరలో విమాన యాత్రలు కూడా చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
దొరికితే ప్రజలు వెంటబడి కొడతారని వైసీపీ నేతలకు భయం పట్టుకుందని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. పొత్తులు ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని తెలిపారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు యాత్రకు వస్తోన్న స్పందన చూసి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని ఆయన చెప్పారు.