శారీరక నొప్పులూ.. కేన్సర్ సంకేతాలు కావచ్చు!
- శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి రావచ్చు
- అదే పనిగా ఉన్నా.. వచ్చి పోతున్నా.. క్యాన్సర్ గా అనుమానించాల్సిందే
- తీవ్రత పెరుగుతుంటే నిర్లక్ష్యం వద్దు
- వైద్యుల వద్దకు వెళ్లి నిర్ధారించుకుంటేనే రక్షణ
గతంతో పోలిస్తే క్యాన్సర్ రిస్క్ నేడు అధికమైంది. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. వైద్యులు కూడా ఇతమిద్ధంగా ఏమీ చెప్పడం లేదు. కనుక ముందస్తు స్క్రీనింగ్ ఒక్కటే ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ ను ముందస్తు దశలో గుర్తిస్తే చికిత్సతో నయం చేసుకోవచ్చు. మహమ్మారి మూడు లేదా నాలుగో దశకు విస్తరిస్తే దాన్నుంచి బయటపడడం కష్టం. క్యాన్సర్ అడ్వాన్స్ డ్ (విస్తరించిన) దశకు చేరిన తర్వాతే అది ఉన్నట్టు చాలా మందిలో బయటపడుతోంది. అప్పుడు కానీ వారిలో లక్షణాలు బయటకు రావడం లేదు. కాకపోతే కొన్ని సంకేతాలను బట్టి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టొచ్చన్నది నిపుణుల సూచన.
శరీర భాగాల్లో నొప్పి రావడం
ఒంటి నొప్పులను క్యాన్సర్ సూచికగా తీసుకోవచ్చు. ఇది కూడా ముందస్తుగా కనిపించే లక్షణం కాదు. క్యాన్సర్ శరీరంలోని నరాలు, అవయవాలకు విస్తరించినట్టు తెలియజేసే సంకేతం. నొప్పి దీర్ఘకాలంగా వేధిస్తుంటే, మందులు వేసుకున్నా ఉపశమనం లేకపోతే అప్పుడు క్యాన్సర్ గా అనుమానించడం వల్ల నష్టం లేదు. ఏ భాగంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నాయో.. ఆయా భాగాల్లో నొప్పి కనిపించొచ్చు.
ఎందుకని..?
క్యాన్సర్ లో ట్యూమర్లు ఏర్పడతాయని తెలిసిందే. ఈ ట్యూమర్ పెరుగుతూ ఎముకలు, నరాలు, ఇతర అవయవాలను ఒత్తిడికి గురి చేసిన సందర్భాల్లో నొప్పి వస్తుంది.
నొప్పుల్లో రకాలు..
సోమాటిక్: ఎక్కువ మందిలో క్యాన్సర్ కారణంగా కనిపించేది ఒంటి నొప్పులే. ఒళ్లు సలుపులు, తిమ్మిర్లు కనిపిస్తుంటాయి. మధ్య మధ్య వచ్చి పోవచ్చు. అలానే కొనసాగొచ్చు.
న్యూరోపతిక్: క్యాన్సర్ లో న్యూరోపతిక్ నొప్పి కూడా ఉండొచ్చు. క్యాన్సర్ కణాల కారణంగా నరాలు దెబ్బతింటే ఈ నొప్పి వస్తుంది. లేదా క్యాన్సర్ కు తీసుకునే కీమోథెరపీ, రేడియో థెరపీలోనూ ఇది కనిపిస్తుంది.
విసెరల్: అంతర అవయవాల్లోనూ నొప్పి కనిపించొచ్చు. ఇలా వచ్చే నొప్పుల్లో 28 శాతం క్యాన్సర్ వల్లే ఉంటున్నాయి. ఛాతీ, ఉదరం లేదా పొత్తి కడపు భాగంలో నొప్పి అదే పనిగా వస్తుంటే క్యాన్సర్ స్క్రీన్ కు వెళ్లడం మంచిదే. అలాగే, దీర్ఘకాలం పాటు శరీర భాగాల్లో ఎక్కడైనా నొప్పి వేధిస్తుంటే క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
క్యాన్సర్ నొప్పి మోస్తరుగా, తీవ్రంగా, మంటగా అనిపించొచ్చన్నది ప్రఖ్యాత మయో క్లినిక్ నిర్వచనం. ఎప్పుడూ ఉండొచ్చు. లేదంటే వచ్చి పోతుండవచ్చు. తక్కువ లేదా మోస్తరు లేదా తీవ్రంగాను ఉండొచ్చు. అందుకుని నొప్పి విడవకపోతే.. అదే పనిగా వస్తుంటే వైద్యులను సంప్రదించి కారణాలను గుర్తించడమే రక్షణ.