రాష్ట్రంలో రాక్షస క్రీడ.. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు: నారా లోకేశ్
- ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా అన్న లోకేశ్
- వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని విమర్శ
- సుబ్రహ్మణ్యం మృతిని ఎమ్మెల్సీ అనంత బాబు యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
''ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారు. తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం.. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు?
వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి'' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.