ఫ్లయిట్ లో గతంలో ఉద్యోగినిపై మస్క్ లైంగిక వేధింపులు.. ఖండించిన టెస్లా అధినేత

  • 2018లో 2.5 లక్షల డాలర్ల పరిహారం చెల్లించిన స్పేస్ఎక్స్
  • వెలుగులోకి ఓ వార్తా కథనం
  • రాజకీయ ప్రేరేపితమన్న మస్క్
  • మాట్లాడే స్వేచ్ఛ విషయంలో తన పోరాటాన్ని అడ్డుకోలేరని వ్యాఖ్య
  టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన బిజినెస్ ఫ్లయిట్ లో అటెండెంట్ గా వ్యవహరిస్తూ, ఆయనకు సపర్యలు చేసే మహిళా ఉద్యోగి పట్ల.. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు లోగడ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆమె మౌనంగా ఉండేందుకు 2018లోనే 2,50,000 డాలర్లను (సుమారు రూ.2 కోట్లు) స్పేస్ఎక్స్ కంపెనీ చెల్లించినట్టు తాజా కథనం ఒకటి బయటకు వచ్చింది.  

స్పేస్ ఎక్స్ కార్పొరేట్ జెట్ ఫ్లయిట్ లో కాంట్రాక్టు విధానంలో ఆమె అటెండెంట్ గా పనిచేసేవారు. మొదట ఎయిర్ హోస్టెస్ గా తీసుకోగా.. అనంతరం మస్క్ కు మస్సాజ్ చేసే పని అప్పగించినట్టు ఆమె తన స్నేహితురాలికి చెప్పిన విషయాన్ని ఓ పత్రిక బయట పెట్టింది. అందులోని వెర్షన్ ప్రకారం.. 2016లో ఓ రోజు ఫ్లయిట్ లో తన గదికి రావాలని మస్క్ అటెండెంట్ ను ఆదేశించారు. లోపలికి వెళ్లిన తర్వాత మస్క్ అర్ధనగ్నంగా ఉన్నారు. ఆమె అనుమతి లేకుండా కాలిపై చేయి వేసి ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడన్నది ఆరోపణ.

దీనిపై మస్క్ స్పందించారు. తనపై జరుగుతున్న దాడిని రాజకీయ కోణం నుంచి చూడాలని వ్యాఖ్యానించారు. ‘‘మంచి భవిష్యత్తు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు విషయంలో పోరాడకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరు’’ అంటూ మస్క్ ప్రకటించారు.


More Telugu News