ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం.. బాలికపై దారుణానికి పాల్పడిన బీటెక్ విద్యార్థులు

  • గుంటూరు నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం
  • మాయమాటలతో బాలికను లాడ్జీకి తీసుకెళ్లిన యువకులు
  • మద్యం తాగించి, అనంతరం అత్యాచారం
విద్యార్థులపై సామాజిక మాధ్యమాలు చూపించే దుష్ప్రభావాలకు ఇదొక నిదర్శనం. గుంటూరు పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమైన వ్యక్తులను నమ్మి నిండా మోసపోయింది. సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసులు ఈ కేసు వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. 

గుంటూరు పట్టణానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా తాడికొండ మండలం నల్లపాడు గ్రామానికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి డి.గ్రేస్ బాబు పరిచయం అయ్యాడు. ఆమెను స్నేహితురాలిగా మార్చుకున్న అతడు తన స్నేహితులైన రిక్కీ, మణికంఠలను పరిచయం చేశాడు. గత బుధవారం (ఈ నెల 18న) గ్రేస్ బాబు, రిక్కీ, మణికంఠ గుంటూరుకు వచ్చి ఓ లాడ్జిలో గది తీసుకుని మద్యం తీసుకున్నారు. 

మధ్యాహ్నం సమయంలో గ్రేసు బాబు మద్యం తాగి స్పృహ కోల్పోయిన తర్వాత.. అతడి ఇద్దరు స్నేహితుల్లో ఒకరు సదరు బాలికకు వీడియో కాల్ చేశాడు. గ్రేసు బాబును చూపించి ‘మద్యం తాగి పడిపోయాడని.. నీవొస్తే కానీ, అన్నం తినను అంటున్నట్టు’ చెప్పాడు. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బైక్ పై లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ గ్రేస్ బాబు ఇద్దరు స్నేహితులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మత్తులోకి జారుకున్న అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. 

సాయంత్రం ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ కనిపించకపోయే సరికి ఆందోళన చెందారు. ఆ తర్వాత బాలికను సదరు ఇద్దరు వ్యక్తులు బైక్ పై తీసుకొచ్చి ఇంటి సమీపంలో దింపేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆమె జరిగిన దారుణాన్ని చెప్పింది. దీనిపై గుంటూరు నల్లపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించగా అత్యాచారం జరిగినట్టు తేలింది.


More Telugu News