హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్.. ఐపీఎల్ నియమావళి ఉల్లంఘన
- ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి రావడంతో వేడ్ లో అసహనం
- డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి పిచ్చి చేష్టలు
- లెవల్ 1 ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఐపీఎల్ ప్రకటన
గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్ మాథ్యూ వేడ్ సహనం కోల్పోయాడు. క్రీడాస్ఫూర్తి మరిచి వ్యవహరించాడు. 16 పరుగుల తక్కువ స్కోరుకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి రావడంతో రెచ్చిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లడం ఆలస్యం తలకున్న హెల్మెట్ ను బలంగా నేలకు విసిరేసి కొట్టాడు. బ్యాట్ ను ముక్కలుగా ఇరగ్గొట్టాడు. ఇది కెమెరాల్లో రికార్డు అయింది. ఆర్సీబీ-గుజరాత్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఆడింది 13 బంతులే అయినా ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదిన వేడ్.. మ్యాక్స్ వెల్ బౌలింగ్ కు చిక్కాడు. అప్పీల్ కు వెళ్లినప్పటికీ అవుట్ గానే తేలింది. అనంతరం వేడ్ ప్రవర్తన ఐపీఎల్ నియమావళి ఉల్లంఘనగా తేల్చారు. మ్యాచ్ రిఫరీ తీసుకునే చర్యలకు అతడు కట్టుబడి ఉండాలి. మాథ్యూ వేడ్ ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ లలో చేసిన స్కోరు కేవలం 116 పరుగులు. మొదట్లో శుభమన్ గిల్ తో కలసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం లభించగా.. ఆ తర్వాత మూడో స్థానానికి మార్చారు. తను ఈ సీజన్ లో పెద్దగా రాణించలేకపోవడం కూడా అసహనానికి కారణమై ఉండొచ్చు.
వేడ్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు ఐపీఎల్ ప్రకటించింది. ‘‘ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.5 కింద లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు వేడ్ అంగీకరించాడు. ఆంక్షలకు ఆమోదం తెలిపాడు. లెవల్ 1 నియమావళి ఉల్లంఘనలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమం. దానికి కట్టుబడి ఉండాలి’’ అని ఐపీఎల్ పాలకమండలి ప్రకటించింది.