అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడగలిగాను: విరాట్ కోహ్లీ
- ఈ మ్యాచ్ లో తనపై భారీ అంచనాలు పెట్టుకున్నారన్న కోహ్లీ
- కారణం ఇంతకుముందు తాను ఆడిన విధానమేనని వ్యాఖ్య
- రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోకూడదన్న విరాట్
- రాణించేందుకు చాలా కష్టపడ్డానని వివరణ
- మ్యాచ్‌కు ముందు 90 నిమిషాల పాటు సాధన చేశానన్న క్రికెటర్
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలం తర్వాత మళ్లీ చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. గత రాత్రి జరిగిన మ్యాచ్ లో 73 పరుగులు చేసి మళ్లీ ఫాంలోకి రావడంపై ఆయన స్పందించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తాను టీమ్ లో సరిగ్గా రాణించలేకపోయానని, దీంతో నిరాశకు గురయ్యానని అన్నాడు.
తాజా మ్యాచ్ లో మాత్రం తాను ప్రభావం చూపించగలిగానని, దీంతో తమ జట్టు మంచి స్థితిలో నిలిచిందని తెలిపాడు. తాజా మ్యాచ్ లో తనపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు తాను ఆడిన విధానమేనని అన్నాడు. జట్టులో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన ఆలోచనా విధానాన్ని పాజిటివ్ గా ఉంచుకోవాలని తెలిపాడు. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోకూడదని చెప్పాడు.
తాను ఈ మ్యాచ్ లో రాణించేందుకు చాలా కష్టపడ్డానని తెలిపాడు. ఈ మ్యాచ్‌కు ముందు నెట్స్ లో దాదాపు 90 నిమిషాల పాటు సాధన చేశానని, దీంతో చాలా ప్రశాంతంగా మ్యాచులో ఆడగలిగానని అన్నాడు. షమీ బౌలింగ్ లో తొలిషాట్ కొట్టినప్పటి నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగిందని తెలిపాడు. ప్రస్తుత సీజన్ లో అభిమానుల నుంచి తనకు మంచి మద్దతు లభించిందని చెప్పాడు.