దావోస్ బయలుదేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
- ఎల్లుండి నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు
- ఈ రోజు రాత్రి దావోస్ చేరుకోనున్న జగన్
- ఆయనతో పాటు పలువురు మంత్రులు, అధికారులు
దావోస్ లో ఎల్లుండి నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి దావోస్ కు బయలుదేరారు. ఈ రోజు రాత్రి దావోస్ చేరుకుంటారు. జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటనలో వారు పాల్గొంటున్నారు.
పలు దేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో జగన్ బృందం భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి చెప్పనుంది. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరుగుతాయి.
విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు ఏపీలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు విమానాశ్రయాల అభివృద్ధి పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరిస్తారు. వీటితో పాటు అనేక అంశాలపై చర్చలు జరుపుతారు.