విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి!
- బెంగళూరు తరపున 7 వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు
- ఐపీఎల్‌లో బెంగళూరు తరపున 6,600 పరుగులు
- మిగతావి చాంపియన్స్ లీగ్‌లో సాధించినవి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఆ జట్టు తరపున 7 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మునుపటి ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ సాధించిన ఏడు వేల పరుగుల్లో 6,600 పరుగులు ఐపీఎల్‌లో రాగా, మిగతా రన్స్ చాంపియన్స్ లీగ్‌లో సాధించినవి. ఈ లీగ్ ప్రస్తుతం ఉనికిలో లేదు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 73 పరుగులు ఈ సీజన్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది. అయితే, ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మాత్రం ఢిల్లీ కేపిటల్స్ జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. గెలిస్తే కనుక మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. బెంగళూరు ఇంటి ముఖం పడుతుంది.