డాక్టర్ వద్ద ఏడ్చిందంటూ మహిళా రోగికి రూ.3 వేలకు పైగా బిల్లు!
- అమెరికాలో ఘటన
- ప్రముఖ యూట్యూబర్ సోదరికి వింత అనుభవం
- గత జనవరిలో ఆసుపత్రికి వెళ్లిన వైనం
- డాక్టర్ వద్ద బాధలు చెప్పుకుని ఏడ్చిన యువతి
- బిల్లులో ఆ విషయాన్ని కూడా పేర్కొన్న ఆసుపత్రి వర్గాలు
అమెరికాలో ఓ ఆసుపత్రి రోగి కన్నీటికి కూడా బిల్లు వేసిన వైనం ఇటీవల వెల్లడైంది. కమిల్లే జాన్సన్ ఓ పాప్యులర్ యూట్యూబర్. సోషల్ మీడియాలో ఆమె ఎంతో ఫేమస్. యూట్యూబ్ లో కమిల్లే జాన్సన్ కు 4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. కాగా, తన చెల్లెలికి ఆసుపత్రిలో ఎదురైన విచిత్ర అనుభవాన్ని కమిల్లే తాజాగా వెల్లడించింది.
కమిల్లే సోదరి మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆమె కొంచెం బాధను కూడా తట్టుకోలేదట. అసహనం, కోపం వంటి భావాలు కలిగినప్పుడు వెంటనే ఏడ్చేస్తుంది. అయితే, దీనిపై డాక్టర్ సలహా తీసుకుందామని తన సోదరి ఆసుపత్రికి వెళ్లిందని కమిల్లే తెలిపింది. పలు రకాల టెస్టులు చేసి భారీగా బిల్లు వేశారని వివరించింది.
అయితే, బిల్లులో ఓ చోట "కొద్దిగా ఏడ్చినందుకు 40 డాలర్లు" అంటూ ఉండడం తనను విస్మయానికి గురిచేసిందని కమిల్లే పేర్కొంది. విజన్ ఎసెస్ మెంట్ టెస్టుకు 20 డాలర్లు, హిమోగ్లోబిన్ టెస్టుకు 15 డాలర్లు, సాధారణ రక్తపరీక్షకు 30 డాలర్లు, ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ కు 350 డాలర్లు బిల్లు వేశారని, ఆ బిల్లులోనే... "ఏడ్చినందుకు 40 డాలర్లు" అని ఉండడాన్ని నమ్మలేకపోయానని కమిల్లే జాన్సన్ వివరించింది.
డాక్టర్ వద్ద బాధలు చెప్పుకుని ఏడ్చినందుకు ఇలా రూ.3,100 మేర బిల్లు వేయడం తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించింది. ఎందుకు ఏడ్చింది? ఆమెకు సాయపడేందుకు ప్రయత్నించారా? ఏడుపు తగ్గేందుకు ఏమైనా మందులు రాశారా? అనే వివరాలేవీ బిల్లులో లేవని ఆరోపించింది. ఈ మేరకు తన సోదరి ఆసుపత్రి బిల్లును కమిల్లే జాన్సన్ ట్విట్టర్ లో పంచుకుంది. దాంతో నెటిజన్లు ఆ బిల్లును వైరల్ చేస్తున్నారు.