మీ ఎంపీలు చెప్పిన విషయం మీకు వినిపిస్తోందా?: జగన్‌కు సోము వీర్రాజు ప్రశ్న
- ధాన్యం కొనుగోళ్లలో దర్జాగా దోపిడీ జరుగుతోందన్న వీర్రాజు
- ఇది వైసీపీ ఎంపీలు స్వయంగా చెబుతున్నదేనని వ్యాఖ్య
- జగన్ నోరిప్పితేనే ఈ దోపిడీ బయటకొస్తుందన్న వీర్రాజు
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీలో దర్జాగా దోపిడీ సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఇదేదో విపక్షంగా ఉన్న తాము చెబుతున్న విషయం కాదని... స్వయానా వైసీపీ రాజ్యసభ సభ్యులే ఈ విషయాన్ని చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇలా దర్జాగా సాగుతున్న దోపిడీ బట్టబయలు కావాలంటూ సీఎం జగన్ నోరు విప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోము వీర్రాజు గురువారం మధ్యాహ్నం రెండు వరుస ట్వీట్లు చేశారు.
ధాన్యం కొనేది మిల్లర్లు.. గణాంకాలు లెక్కించేది ఆర్బీకే సెంటర్లు.. ఈ విధంగా వారంతట వారే బాధ్యతలు పంచుకుని రైతుల సొమ్ము మింగేస్తున్నారంటూ వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దర్జా దోపిడి వెనుక ఎవరు ఉన్నారన్నది దర్యాప్తు సంస్ధలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము మాట్లాడితే నైతికత లేదంటూ దుష్ప్రచారం చేస్తారన్న వీర్రాజు.. తమ ఉద్యమాలను ఉక్కు పాదంతో అణచివేస్తారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. స్వయానా మీ సొంత పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రస్తావించిన విషయం మీకు వినిపిస్తోందా? అంటూ ఆయన జగన్‌ను ప్రశ్నించారు. 'రైతుల నోట్లో మట్టికొట్టి రైతు కష్టాన్ని కోట్ల రూపంలో కూడగట్టుకుంటున్న పాపమే మీ పతనానికి నాంది' అంటూ ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు.