శ్రీలంక పరిస్థితి పట్ల చలించిపోయిన తమిళనాడు సర్కారు... భారీగా నిత్యావసర వస్తువుల తరలింపు

  • శ్రీలంకతో దుర్భరంగా మారిన ప్రజాజీవనం
  • ప్రజలకు అందుబాటులో లేని నిత్యావసరాలు
  • ఆకాశాన్నంటుతున్న ధరలు
  • తమిళనాడు ఆపన్నహస్తం
స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక పరిస్థితి పట్ల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చలించిపోయింది. శ్రీలంకకు ఆపన్నహస్తం అందించేందుకు సీఎం స్టాలిన్ హుటాహుటీన చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున నిత్యావసరాలను శ్రీలంకకు పంపించారు. చెన్నై పోర్టు నుంచి ఓ భారీ నౌకలో 9 వేల టన్నుల బియ్యం, 200 టన్నుల పాలపొడి, 24 టన్నుల కీలక ఔషధాలను శ్రీలంకకు తరలించారు. ఈ నిత్యావసరాల విలువ రూ.45 కోట్లు ఉంటుందని అంచనా. 

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే శ్రీలంకకు 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాలపొడి, పెద్దసంఖ్యలో ప్రాణాధార ఔషధాలు పంపిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. తొలి విడత నిత్యావసరాలతో కూడిన నౌకకు నిన్న స్టాలిన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. శ్రీలంక దయనీయ పరిస్థితి పట్ల ప్రజలు కూడా మానవతా దృక్పథంతో స్పందించి విరాళాలు అందజేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
.


More Telugu News