సామాన్యుల నెత్తిన మళ్లీ ‘బండ’.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 3.50 పెంపు
- ఈ నెలలో రెండోసారి పెంపు
- తాజా పెంపుతో దేశవ్యాప్తంగా రూ. 1000 దాటేసిన సిలిండర్ ధర
- కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 8 పెంపు
- కోల్‌కతాలో అత్యధికంగా రూ. 1029కి చేరుకున్న సిలిండర్ ధర
గత కొంతకాలంగా అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు తాజాగా మరోమారు పెరిగాయి. గృహ వినియోగ వంటగ్యాస్ ధర రూ. 3.50, వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా రూ. 1000 దాటేసింది.
ఈ పెంపుతో కలుపుకుని ఢిల్లీ, ముంబైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1003కు చేరుకోగా, కోల్‌కతాలో రూ. 1029, చెన్నైలో 1018.5కి చేరుకుంది. కాగా, ఈ నెల 7న సిలిండర్ ధరను ప్రభుత్వం ఏకంగా రూ. 50 పెంచిన విషయం తెలిసిందే.