వైఎస్సార్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జన నీరాజనం.. వీడియో ఇదిగో!
- నిన్న కడపలో పర్యటించిన చంద్రబాబు
- అడుగడుగునా పోటెత్తిన అభిమానం
- వర్షంలోనూ చంద్రబాబు కోసం ఎదురుచూపులు
- కమలాపురంలో రాత్రి 9 గంటలకు ముగిసిన సభ
కడప జిల్లాలో నిన్న పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి జనం జేజేలు పలికారు. పట్టణంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న బాబు అనంతరం జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటకు వెళ్లారు. టీడీపీ శ్రేణులు అక్కడాయనకు ఘన స్వాగతం పలికాయి. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో 2 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ మండపానికి బయలుదేరారు. ఈ మాత్రం దూరాన్ని చేరుకునేందుకు చంద్రబాబుకు ఏకంగా గంటన్నర సమయం పట్టింది. కడపలో రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు భారీ క్రేన్ల సాయంతో గజమాలతో సత్కరించారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో భారీ ర్యాలీ మధ్య చెన్నూరు బయలుదేరారు. అప్పటికే వర్షం మొదలైనప్పటికీ లెక్కచేయకుండా చంద్రబాబు కోసం ఎదురుచూశారు.
ఖాజీపేటలో వేలమంది చేరడంతో ప్రసంగించిన టీడీపీ అధినేత అక్కడి నుంచి కమలాపురం చేరుకునే సరికి రాత్రి 7.15 గంటలైంది. అక్కడ రాత్రి 9 గంటల వరకు సభ జరిగింది. అప్పటి వరకు ఓపికతో ఉన్న జనం బాబు ప్రసంగానికి హర్షధ్వానాలు పలికారు.