26న మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్న కూతురి పెళ్లి... కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి
- ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసిన మంత్రి
- కూతురు పెళ్లికి హాజరు కావాలంటూ వినతి
- వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన వైనం
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట పెళ్లి వేడుకకు రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 26న శ్రీనివాస్ గౌడ్ చిన్న కుమార్తె హర్షిత పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుక ఏర్పాట్లలో నిమగ్నమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్... బుధవారం నాడు ప్రగతి భవన్కు వచ్చారు. సీఎం కేసీఆర్ను కలిసి తన కూతురు వివాహానికి హాజరు కావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను ఆయన కేసీఆర్కు అందజేశారు.