సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'

సెన్సార్  పూర్తి చేసుకున్న 'శేఖర్'
  • రాజశేఖర్ తాజా చిత్రంగా రూపొందిన 'శేఖర్'
  • రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ
  • సెన్సార్ బోర్డు నుంచి లభించిన U/A సర్టిఫికెట్ 
  • ఈ నెల 20వ తేదీన సినిమా విడుదల  
రాజశేఖర్ మొదటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ తరహా పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఆ తరహా ఆ పాత్రలే ఆయనకి ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. 'గరుడ వేగ' .. ' కల్కి' రెండు కూడా ఆ తరహా సినిమాలే. అదే విధంగా 'శేఖర్ ' కూడా పోలీస్ మార్క్ సినిమానే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రాజశేఖర్ సరసన నాయికగా ముస్కాన్ .. ఆత్మీయ రాజన్ నాయికలుగా అలరించనున్నారు. 

ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో శివాని నటించడం విశేషం. అంతవరకూ రాజశేఖర్ తో జీవిత చేసిన సినిమాలలో 'ఎవడైతే నాకేంటి' పెద్ద హిట్. మరి ఆ సినిమాను మించిన హిట్ ను ఈ సినిమా సొంతం చేసుకుంటుందేమో చూడాలి.


More Telugu News