ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజాల్ రాజీనామా!
- రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన బైజాల్
- వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా అని వెల్లడి
- కేజ్రీవాల్‌తో విభేదాలే రాజీనామాకు కారణమంటూ కథనాలు
దేశ రాజధాని ఢిల్లీకి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ బైజాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా బైజాల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
అయితే ఢిల్లీ సీఎంగా ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదాల కారణంగా అనిల్ బైజాల్ రాజీనామా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పాలనకు సంబంధించి కేజ్రీవాల్, బైజాల్‌కు మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నట్లు సమాచారం. ఈ కారణంగా బైజాల్ తన పదవికి రాజీనామా చేశారంటూ పలు జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.