తెలంగాణ నుంచి రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే!
- హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథికి అవకాశం
- నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావుకూ ఛాన్స్
- ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవికి అవకాశం ఇచ్చిన కేసీఆర్
తెలంగాణ కోటాలో ఇప్పటికే ఖాళీ అయిన ఓ రాజ్యసభ స్థానంతో పాటుగా త్వరలో ఖాళీ కానున్న మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు స్థానాలకు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావులను ఖరారు చేశారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపికైన ముగ్గురిలో ఏ ఒక్కరికీ కూడా పెద్దగా రాజకీయ నేపథ్యం లేదనే చెప్పాలి. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కానున్న బండి పార్థసారథి రెడ్డి ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌కు అధినేతగా కొనసాగుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కూడా పెద్దగా రాజకీయ వాసనలు లేని వారే, ఇక 'నమస్తే తెలంగాణ' ఎండీగా కొనసాగుతున్న దీవకొండ దామోదర్ రావు కూడా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని వారుగానే చెప్పాలి.