కేన్స్ చలన చిత్రోత్సవం.. రెడ్ కార్పెట్ పై భారత్ తరఫున తొలి జానపద కళాకారుడు!

  • ఫిల్మ్ ఫెస్టివల్ కు జానపద గాయకుడు మామే ఖాన్
  • సంప్రదాయ రాజస్థానీ డ్రెస్ లో హాజరు
  • భారత ప్రభత్వం తరఫున అధికారికంగా హాజరు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజస్థానీ సింగర్ మామే ఖాన్ చరిత్ర సృష్టించాడు. కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన తొట్టతొలి భారత జానపద కళాకారుడిగా రికార్డు సృష్టించాడు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని భారత బృందంలో సభ్యుడిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మామే ఖాన్ పాల్గొన్నాడు. అతడితో పాటు ఆర్ మాధవన్, రిక్కీ కేజ, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్ లు ప్రభుత్వ ప్రతినిధులుగా రెడ్ కార్పెట్ మీద నడిచారు. 

కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన మామే ఖాన్.. సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో అలరించాడు. ఆ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అంజులీ చక్రవర్తి రూపొందించారు. కాగా, లక్ బైచాన్స్, ఐ యామ్, నో వన్ కిల్డ్ జెస్సికా, మాన్సూన్ మ్యాంగోస్, మిర్చిజయా, సోంచిరియా వంటి సినిమాల్లోనూ మామే ఖాన్ పాటలు పాడాడు.


More Telugu News