అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ.. ఇంటర్ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన తోటి విద్యార్థి
- హైదరాబాద్, రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ లో ఘటన
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీలో చదువుతోన్న ముగ్గురు విద్యార్థులు
- వారిలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తోన్న వైనం
- మూసీకాలువ వద్దకు వెళ్లి మాట్లాడుకుని దాడి
అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ పడి ఇంటర్ విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు తోటి విద్యార్థి. అంతేకాదు, బాధిత విద్యార్థి కడుపులో నుంచి రక్తం కారుతుండగా అతడితో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్, రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ లో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఈ కేసును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. బాలుడిని కత్తితో పొడిచిన విద్యార్థితో పాటు మరొక బాలుడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.
వారిలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో వారు అత్తాపూర్ లోని మూసీకాలువ వద్దకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఓ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కత్తి కూడా తీసుకొచ్చాడు. తాను ప్రేమిస్తోన్న అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావంటూ విద్యార్థిని పొడిచి తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.