హీరో రాజశేఖర్ గారి వల్లనే నేను ఫేమస్ అయ్యానంటే నమ్ముతారా?: దర్శకుడు సుకుమార్
- 'శేఖర్' ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన సుకుమార్
- ఒకప్పుడు తాను రాజశేఖర్ కు అభిమానినని వెల్లడి
- అప్పట్లో ఆయనను ఇమిటేట్ చేసేవాడినంటూ వ్యాఖ్య
- తాను సినిమాల్లోకి రావడానికి పరోక్ష కారణం ఆయనేనంటూ వివరణ
మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'జోసెఫ్' సినిమాకి తెలుగు రీమేక్ గా 'శేఖర్' సినిమా రూపొందింది. రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన సుకుమార్ మాట్లాడాడు.
"అప్పట్లో నేను రాజశేఖర్ గారికి ఫ్యాన్ ని. ఆయనను ఇమిటేట్ చేయడం వలన మా ఊళ్లో ఫేమస్ అయ్యాను. ఇది నిజం .. నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. నేను సినిమాలకి పనికి వస్తాననే విషయాన్ని నాకు పరోక్షంగా తెలిసేలా చేసింది రాజశేఖర్ గారే. ఇక ఆయన తన కూతుళ్లను కూడా సినిమాల్లోకి తీసుకుని వచ్చి ఇండస్ట్రీ గౌరవాన్ని నిలబెట్టారు.
ఇక ఈ సినిమా కోసం జీవితగారు ఎంతగా కష్టపడ్డారనేది నాకు తెలుసు. ఒక వైపున తన ఫ్యామిలీని చూసుకుంటూ .. మరో వైపున డైరెక్షన్ .. ప్రమోషన్స్ చూసుకోవడం మామూలు విషయం కాదు. అందుకు నిజంగా ఆమెకి దణ్ణం పెట్టాలి. ఆమె కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.