కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి హార్దిక్ పటేల్ రాజీనామా
- హార్దిక్ పటేల్ బీజేపీలో చేరే అవకాశం
- ట్విట్టర్‌లో ఓ లేఖ పోస్ట్ చేసిన పటీదార్ నేత
- గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అందరూ ఊహించినట్లే పటీదార్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఆ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్విట్టర్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 15న హార్దిక్ పటేల్ ఇతర పటీదార్ నేతలు అల్పేశ్ ఖతిరియా, దినేశ్ బాంభానియాతో కలిసి బీజేపీ నేత, గుజరాత్ మంత్రి నరేశ్ పటేల్‌ను కలిశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటీదార్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న హార్దిక్ పటేల్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లే. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్టు హార్దిక్ పటేల్ ఇటీవలే తెలిపారు.