బెంగళూరులో రోడ్డు మీద కొట్టేసుకున్న స్కూల్ విద్యార్థినులు.. వీడియో వైరల్

  • జుట్లు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు
  • స్టిక్ తీసుకుని దాడికి దిగిన ఓ బాలిక
  • చిన్న స్ఫర్థ ఘర్షణగా మారిన వైనం
విద్యార్థులపై సినిమాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది..? అంటే.. బెంగళూరులో స్కూల్ విద్యార్థినులు వీధిలో ముష్టి యుద్ధానికి దిగడాన్ని చూస్తే  మనకు తెలుస్తుంది. కొందరు స్కూల్ యూనిఫామ్ లో ఉండగా, మరికొందరు ప్యాంట్, టీ షర్ట్ వస్త్ర ధారణతో ఉన్నారు. ఒకరినొకరు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పెద్ద స్టిక్ పట్టుకుని దాడికి దిగడం వీడియోలో కనిపిస్తోంది. 

అదే ప్రదేశంలో విద్యార్థులు కూడా ఉన్నారు. వీధిలో అటూ ఇటూ వాహనాలు కూడా వెళుతున్నాయి. కానీ, ఎవరూ అడ్డుకున్నది లేదు. స్కూల్ బిల్డింగ్ ముందే దాడి చేసుకున్నట్టుగా ఉంది. స్కూల్ సిబ్బంది కూడా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. సరిగ్గా ఇది ఏ రోజు, ఏ ప్రాంతంలో అన్నది తెలియదు.

రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణగా దీన్ని భావిస్తున్నారు. అందులో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న స్పర్థ గ్రూపు ఫైట్ కు దారితీసినట్టు తెలుస్తోంది. చివరికి ఇద్దరు విద్యార్థులు కలుగజేసుకుని బాలికలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


More Telugu News