చంద్రబాబు ముందు చూపుకి నిదర్శనమే గ్రీన్‌కో!: టీడీపీ ట్వీట్
- చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టుకు భూ కేటాయింపు
- 4,766 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు
- జగన్ కొర్రీల కారణంగానే ప్రాజెక్టు ఆలస్యమైందన్న టీడీపీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించిన గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టుపై విపక్ష టీడీపీ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అందులో తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన 4,766 ఎకరాల భూమిని ఆ సంస్థకు టీడీపీ ప్రభుత్వమే కేటాయించిందని కూడా వెల్లడించింది. చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమే గ్రీన్‌కో ప్రాజెక్టు అని పేర్కొంది.
టీడీపీ హయాంలో భూమి కేటాయింపు పూర్తయిన ఈ ప్రాజెక్టులో జరిగిన తీవ్ర జాప్యానికి కారణం సీఎం జగనేనని కూడా టీడీపీ ఆరోపించింది. సీఎం జగన్ సోలార్ టారిఫ్‌లో సవరణల పేరిట కొర్రీలు వేశారని, ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని తెలిపింది. ఈ మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టును ఆపి ఉండకపోతే ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయ్యేవని కూడా టీడీపీ ఆరోపించింది.