సినిమాకి కె.రాఘవేంద్రరావు రాసుకున్న ప్రేమలేఖ... 'ఇన్ఫోసిస్' సుధామూర్తి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

  • తన అనుభవాలతో పుస్తకం రాసిన రాఘవేంద్రరావు
  • ఐదు దశాబ్దాల సినీ జీవితం అక్షరబద్ధం
  • హైదరాబాదులో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • హాజరైన దర్శకులు, రచయితలు
తెలుగు సినీ రంగానికి గ్లామర్ అద్దిన వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్రముఖంగా చెప్పాలి. ఆయన తీసిన చిత్రాల్లో అత్యధికం సూపర్ హిట్లే. అందమైన హీరోయిన్లను కనులవిందుగా చూపించడంలో అందెవేసిన చేయి రాఘవేంద్రరావుది. తొలినాళ్లలో కళాత్మక ధోరణిలో చిత్రాలు తీసిన రాఘవేంద్రరావు... తర్వాతి కాలంలో అగ్రకథానాయకులతో భారీ కమర్షియల్ చిత్రాలు తీసి తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి దర్శకుడిగా వెలుగొందారు.

కాగా, తన ఐదు దశాబ్దాల సినీ రంగ అనుభవాలను ఆయన ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ'. తాజాగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్ధాంగి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, రచయిత బీవీఎస్ రవి తదితరులు విచ్చేశారు. 

కాగా, ఈ పుస్తకం త్వరలోనే మార్కెట్ లో అందుబాటులోకి వస్తుందని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఈ పుస్తకం కొంచెం తీపి, కొంచెం మసాలా తదితర అంశాల సమాహారం అని పేర్కొన్నారు.


More Telugu News