ఏపీలో వెనకబడిన తరగతుల నేతలకి వెన్నుపోటే!... వైసీపీ రాజ్యసభ టికెట్లపై అయ్యన్న వ్యాఖ్య
- నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ఖరారు
- రాజ్యసభకు వెళ్లే అర్హత ఉన్న బీసీలు ఏపీలో లేరా? అన్న అయ్యన్న
- నిధులు, విధులతో పాటు కుర్చీ లేని ఉత్తుత్తి కార్పొరేషన్లే ఏపీ బీసీలకు అంటూ వ్యంగ్యం
- తెలంగాణ వాళ్లకేమో అత్యున్నత రాజ్యసభ సీట్లా? అని ప్రశ్నించిన అయ్యన్న
ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ వైసీపీ చేసిన ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కోటాలోని రాజ్యసభ సీట్లను తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఎలా కేటాయిస్తారన్న అయ్యన్న... పెద్దల సభకి వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాలలో ఏ ఒక్క నేతకీ లేదా? అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం రెండు వరుస ట్వీట్లు చేశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్ తీరును ప్రశ్నిస్తూ అయ్యన్న ట్వీట్లు సాగాయి. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదని మీరనుకుంటున్నారా? అని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్న అయ్యన్న... ఏపీకి సీఎం అయిన మొదటి రోజునుంచే మీరు ఏపీ నిధులు, నీళ్లు, నియామకాలన్నీ తెలంగాణకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. నిధులు, విధులతోపాటు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్లను ఏపీ బీసీలకి విదిల్చి, తెలంగాణ వాళ్లకు అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలో వెనకబడిన తరగతుల నేతలకి వెన్నుపోటేనంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు.