కేంద్ర జల శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో పోలవరంపై కీలక సమావేశం
- ఏపీ, సీడబ్ల్యూసీ అధికారులు సహా ఐఐటీ నిపుణుల హాజరు
- డిజైన్లు, డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్‌లపై ప్రధాన చర్చ
- ఈ భేటీ తర్వాత పెండింగ్ అంశాలపై కేంద్రం కీలక నిర్ణయాలు
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో మంగళవారం ఓ కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర జల శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ అధికారులు, ఐఐటీ నిపుణులు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా పోలవరం డిజైన్లు, డయాఫ్రం వాల్‌పైనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ భేటీ తర్వాత పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, సీడబ్ల్యూసీ అధికారులు అందించిన నివేదికలపైనా ఈ సమావేశంలో కీలక చర్చ సాగుతోంది. మంగళవారం నాటి భేటీలో పోలవరానికి సంబంధించి కీలక నిర్ణయాలన్నీ తీసుకోలేని పక్షంలో బుధవారం కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శితో వెదిరె శ్రీరామ్ భేటీ కానున్నారు.