మొద్దునిద్ర పోతున్నావా?: కేసీఆర్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు

  • వ‌ర్షాల‌కు రైతుల కష్టం వానల్లో కొట్టుకుపోతోందన్న ష‌ర్మిల‌
  • కేసీఆర్‌ దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని ప్ర‌శ్న‌
  • గడి గడపదాటి బయటకొచ్చి రైతును ఆదుకునేందుకు మనసొస్తలేదా? అని నిల‌దీత‌
  • రైతు గోస వినపడ్తలేదా? అని ప్ర‌శ్న‌
రైతులు పండించిన ధాన్యం అకాల వ‌ర్షాల‌కు త‌డిసిపోతోంటే అన్న‌దాత‌ల‌ను తెలంగాణ స‌ర్కారు ఎందుకు ఆదుకోవ‌ట్లేద‌ని వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు షర్మిల ప్ర‌శ్నించారు. 

''రైతుల కష్టం వానల్లో కొట్టుకుపోతుంటే, చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుంటే, చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతుంటే కేసీఆర్‌ దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? గడి గడపదాటి బయటకొచ్చి రైతును ఆదుకునేందుకు మనసొస్తలేదా? రైతు గోస వినపడ్తలేదా? చేతగాక పెడచెవిన పెడుతున్నావా?

లేక మొద్దునిద్ర పోతున్నావా? అప్పులు తేవడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్న మీరు పంట కొనాల‌ని అధికారులను ఎందుకు కల్లాలకు పంపడం లేదు? ఇప్పటికైనా రైతును గోస పెట్టకుండా, తడిసిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా, కల్లాల్లో ధాన్యాన్ని మద్దతు ధరిచ్చి అంతా కొనాలని డిమాండ్ చేస్తున్నాం'' అని ష‌ర్మిల పేర్కొన్నారు.


More Telugu News