4 రాజ్యసభ సీట్ల కోసం.. వైసీపీ పరిశీలనలో ఐదుగురు అభ్యర్థులు
- జూన్ 21తో ముగియనున్న నలుగురి పదవీ కాలం
- ఆలోగానే నాలుగు సీట్ల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్
- వైసీపీ జాబితాలోకి కొత్తగా వచ్చిచేరిన కిల్లి కృపారాణి
- తుది జాబితా కసరత్తులో సీఎం జగన్
ఏపీ కోటాలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లు అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఈ 4 సీట్ల కోసం వైసీపీ అధిష్ఠానం ఐదుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఐదుగురిలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న వేణుంబాక విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురి పేర్లలో నాలుగు పేర్లను రాజ్యసభ స్థానాల కోసం సీఎం జగన్ ఎంపిక చేయనున్నారు.
విజయసాయిరెడ్డితో పాటుగా ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న బీజేపీ నేతలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల సభ్యత్వం జూన్ 21తో ముగియనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వీరు రిటైర్ అయ్యేలోగా వాటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.