ఏపీలో పలువురు ఐపీఎస్ లకు స్థానచలనం... వివరాలు ఇవిగో!

  • రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • పలువురికి అదనపు బాధ్యతల అప్పగింత
  • కొందరిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు వీరే...

  • ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ... టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
  •  క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు... రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు.
  • ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్... లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
  • పోలీసు ట్రైనింగ్ వ్యవహారాల డీఐజీగా కేవీ మోహన్ రావు.

  • తీర ప్రాంత సెక్యూరిటీ డీఐజీగా ఎస్.హరికృష్ణకు అదనపు బాధ్యతలు.
  • గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి... జ్యుడిషియల్ వ్యవహారాల ఐజీగా అదనపు బాధ్యతలు.
  • 16వ బెటాలియన్ కమాండెంట్ గా కోయ ప్రవీణ్ బదిలీ.
  • విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు
  • కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా రవీంద్రనాథ్ బాబుకు అదనపు బాధ్యతలు.
  • గుంతకల్ రైల్వే ఎస్పీగా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు.

  • రంపచోడవరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా జి.కృష్ణకాంత్.
  • చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా పి.జగదీశ్.
  • పాడేరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా తుహిన్ సిన్హా.
  • పల్నాడు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా బిందుమాధవ్ గరికపాటి.
  • విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా పి.రవికుమార్.

  • పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని డి.ఉదయభాస్కర్ కు ఆదేశాలు.
  • పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పి.అనిల్ బాబు బదిలీ.
  • పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు డీఎన్ మహేశ్ బదిలీ.



More Telugu News