తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్
- ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ
- జస్టిస్ శర్మ స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం
- ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ భుయాన్
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం హైకోర్టు సీజేగా వ్యవహరిస్తున్న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గౌహతి హైకోర్టులకు కూడా కొత్త సీజేలను ప్రతిపాదిస్తూ కొలీజియం సిఫారసు చేసింది.
తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం ఆయన స్థానంలో జస్టిస్ భుయాన్‌కు పదోన్నతి కోసం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసుల మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.